బడిత పూజ చేసిన బంధువులు
సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
గంభీరావుపేటలో బిఆర్ఎస్ నాయకుడి శ్రీకాంత్ రెడ్డి అక్రమ సంబంధం బహిర్గతం అయింది. భార్య ఇద్దరు పిల్లలు ఉండగా ముచ్చర్లకు చెందిన మరో మహిళతో శ్రీకాంత్ రెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న భార్య, మహిళా కుటుంబసభ్యులు మరో మహిళతో కలిసి ఉన్న భర్తను పట్టుకుని బడితెపూజ చేసారు. సదరు మహిళ ఏడాది కాలంగా పిల్లలు, భర్తను వదిలివేసి దూరంగా ఉంటుంది. హైదరాబాద్ అల్వాల్ లో ఉంటుదని గుర్తించి మహిళతో పాటు శ్రీకాంత్ రెడ్డిని ఆ మహిళ భర్త, బంధువులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చితక్కొట్టి గంభీరావుపేట కు తీసుకవచ్చారు. గంభీరావుపేటలో మహిళా బందువులు శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసారు. పోలీసుల జోక్యంతో వివాహేతర సంబంధం గొడవ ఠాణకు చేరింది..