అందినకాడికి దోచుకున్న బీఆర్ఎస్ నేతలు

సిరా న్యూస్,మిర్యాలగూడ;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలు హర్షించే విధంగా ప్రజా పరిపాలన కొనసాగుతుందని. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ముందు తాము ఇచ్చిన అన్ని హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని చెప్పారు. పదేళ్లు సచివాలయానికి రాని చరిత్ర కేసీఆర్ ది అయితే.. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే చరిత్ర రేవంత్ రెడ్డి అని అన్నారు.కేటీఆర్ అనే ఒక బచ్చ ,ఆరోగ్యం సరిగా లేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, అధికారంలోకి వస్తాం.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తరలిస్తామని పగటి కలలు కంటున్నాడని తెలిపారు. అభివృద్ధి పేరుతో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందన్నారు
అపార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందిన కాడికి దోచుకున్నారని విమర్శించారు. 60 ఏళ్ల క్రితం తాము కట్టిన నాగార్జునసాగర్ ఇప్పటికీ చెక్కుచెదరలేదని 9వేల కోట్లతో కట్టిన కాలేశ్వరం దుస్థితే బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీకి నిదర్శనం అన్నారు. నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేత పై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని.. అయినా పార్టీ ఆఫీస్ కూల్చివేతపై కోర్టును ఆశ్రయించింది వాళ్లే కానీ తాము కాదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం నాలుగేళ్లు వెనక్కి వెళ్లిందని, తాము అధికారంలోకి రాగానే నిధుల విడుదల పర్యావరణ అనుమతుల క్లియరెన్స్ సాధించమన్నారు. వచ్చే మార్చి నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తవుతాయన్నారు.
ముందుగా.. నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన నాలుగు అండర్ పాస్ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. మిర్యాలగూడ రైస్ మిల్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలోని వరద బాధితులకు 30 టన్నుల బియ్యాన్ని సహాయంగా పంపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *