బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాపార్టీ లోకి రావడానికి సిద్దం గా ఉన్నారు

మంత్రి జూపల్లి కృష్ణారావు
సిరా న్యూస్,హైదరాబాద్;
కేటీఆర్, హరీష్ రావు లు పోటీ పడి సమావేశాలు పెడుతున్నారు. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు తిరగబడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే..రెండేళ్ల పసికూన అని బీఆర్ఎస్ నేతలు అనలేదా. మా హామీలతో పోటీపడి బీఆర్ఎస్ పథకాలు ప్రకటించింది కదా… మరి వాటిని ఎలా అమలు చేసేవారు. శాసనసభ సాక్షి గా బీఆర్ఎస్ అప్పుల కుప్ప బయటపడింది. తెలంగాణ అభివృద్ధి కోసం అదాని ని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
గత సంవత్సరం కృష్ణా లో నిళ్ళు ఉన్నా ఇవ్వలేదు.. ఇప్పుడు నిళ్ళు లేకున్నా, నీళ్లు ఇవ్వమని హరీష్ రావు ఎలా అడుగుతున్నారు. బీఆర్ఎస్ కు ఓట్లు వస్తే కాదా సీట్లు వచ్చేది. బీఆర్ఎస్, బీజేపీ మైత్రి ప్రజలందరికీ తెలుసు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే బీఆర్ఎస్ నేతలు బయపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాపార్టీ లోకి రావడానికి సిద్దం గా ఉన్నా..మేము వద్దనుకుంటుంన్నమని అన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఇంగ్లీషు మాట్లాడటానికే పనికివస్తడు. అడ్మినిస్ట్రేషన్ కి పనికి రాడు. మోడీ, లాల్ బహదూర్ శాస్ర్తీ లకు ఇంగ్లీషు రాదు. పెయిడ్ ఆర్టిస్ట్ లతో ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *