సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ : బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాదులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి జరగా గా శుక్రవారం హైదరాబాద్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముట్టడి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓదెల మండలం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై దాడులే హేయంగా ఇండ్ల పై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ రాష్టములో పోలీస్ పాలన జరుగుతుందని, వెంటనే నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేసిన అరికెపూడి గాంధీ అతని కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి,యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,మాజీ సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి,కనికిరెడ్డి సతీష్, రౌతు జలపతి ,జోంగోని వెంకటేష్ గౌడ్, చింతం మొగిలి, గడ్డం శ్యామ్,రంగు రంజిత్ భోగి సదానందం, పరశురాములు తదితరులు ఉన్నారు