సిరాన్యూస్, జైనథ్
కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వం : బీఆర్ఎస్ రైతు సంఘం మండల అధ్యక్షులు రోకండ్ల రమేష్
రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి
* జైనథ్ రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో
రైతులలో ఆర్థిక సంక్షోభాన్ని గురిచేస్తున్న కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వమని బీఆర్ఎస్ రైతు సంఘం మండల అధ్యక్షులు రోకండ్ల రమేష్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాతో పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్బంగా రోకండ్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానాని రైతులను మోసగించిందన్నారు. అందుకే ఈరోజు వ్యవసాయ పొలంలో ఉండే రైతు రోడ్డెక్కి పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు అందాల్సిన రుణమాఫీ పూర్తిగా అందిన తర్వాతే కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ జోగు రామన్నఆధ్వర్యంలో నిరసనలతో పాటు మరిన్ని ఉధృత కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మాజీ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ ,మాజీ మార్కెట్ చైర్మన్ లు యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, లింగారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.