సిరా న్యూస్, సైదాపూర్:
దాడిని ఖండించిన బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రుద్రారపు శ్రావణ్ కుమార్
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రుద్రారపు శ్రావణ్ కుమార్ ఖండించారు. బుదవారం సైదాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కె.పి. వివేకానంద, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనం అని అన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతగాక, సాయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను చూసి ఓర్వలేకనే ఈ దాడికి తెగబడ్డారని ధ్వజమెత్తారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా నీచ రాజకీయాలు చేస్తూ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోకుండా ప్రతిపక్షాలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇలాంటి ఎన్ని దాడులు జరిగినా సరే ప్రజల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు.