సిరా న్యూస్, బేల:
పాత పనులకు భూమి పూజ చేయడం హాస్యాస్పదం…
గతంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించిన పనులకు మరల ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేయడం హాస్యాస్పదమని టిఆర్ఎస్ పార్టీ బేల మండల నాయకులు మంగేష్ ఠాక్రే అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బేల మండలంలోని ఉపాశ్ నాల గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే పాయల శంకర్ ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జోగు రామన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇండ్ల నిర్మాణం కోసం పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. పాత పనులకు భూమి పూజ చేయడం కాకుండా కొత్తగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తే స్వాగతిస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశం లో బిఆర్ఎస్ పార్టీ బేల మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంబీర్ ఠాక్రే, సతీష్ పవార్, దేవన్న ఒల్లాఫ్ వార్, తేజ్ రావ్ మస్కే, గేడం సునీల్, వీపిన్, చౌహాన్ సుధాకర్, సాదిక్, విశాల్ గోడే, తదితరులు పాల్గోన్నారు.