సిరా న్యూస్,రంగారెడ్డి;
ఉప్పల్ బగాయత్ లో ఓ మహిళా రియలేస్టేట్ వ్యాపారిని ప్రియుడే కారు తో ఢీకొట్టి మర్ధర్ చేసిన వైనం ఇది. కొమ్మవారి మంజుల(40) అనే మహిళ ఎస్ ఎన్ ఎస్ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తుంది. మంజులతో అక్రమ సంబంధం కొనసాగిస్తూన్న చంద్రమౌళి, మంజుల మరో వ్యక్తితో చనువుగా ఉంటుంది అనే అనుమానంతో కారుతో ఢీ కొట్టి హత్య చేశారు. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి (47) ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్ మంజుల వద్ద పనిచేస్తున్నాడు.
చంద్రమౌళికి మంజులతో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడు నెలల నుంచి మరో వ్యక్తితో సదరు మహిళ సన్నిహితంగా ఉందని చంద్రమౌళి అనుమానం పెంచుకున్నాడు.
అంతే కాకుండా మృతురాలు చంద్రమౌళి దగ్గర నుంచి రూ.28 లక్షలు తీసుకొని అడిగితే ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో ఆమె మీద కక్ష పెంచుకొని మద్యం సేవించి ఆదివారం రాత్రి సమయంలో ఉప్పల్ భగయత్ కి తీసుకవచ్చి కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు. మృతురాలు దుస్తులు లేకుండా మర్డర్ కావడం పలు అనుమానాలు కల్గిస్తుంది. నిందితుడు నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
====