సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మిని ట్యాంక్ వద్ద దారుణ హత్య చోటు చేసుకుంది. వ్యక్తి గతకారణాలతో ముగ్గురు యువకులు గొడవపడి చివరకు కత్తిపోట్లకు దారితీసింది. మాట మాట పెరిగి సుమీర్ అనే యువకుడు చిక్కడపల్లి కి చెందిన జిశాన్(23), బుధవార్పేట్ కు చెందిన మతిన్ పై ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జీషాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మతీన్ అనే యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు మతీన్ ను వెంటనే నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేశారు. మతీన్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడి చేసిన యువకుడు పరారీలో ఉన్నాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.
======