సిరాన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం
ఏజెన్సీ ప్రాంతంపై విద్యుత్ అధికారుల చిన్నచూపు ఎందుకు..? : బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి తడికల శివకుమార్
పాలకుల వైఫల్యమా విద్యుత్ ఉన్నత అధికారుల నిర్లక్ష్యమా అని బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్ ప్రశ్నించారు.ఇందులో బాగంగా సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఏజెన్సీ ప్రాంతంపై విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాధారణ బదిలీల్లో బాగంగా మొదటి చాయిస్ ఏజెన్సీకే అని చెప్పిన సీఎం మాటలు నీటి మూటలుగానే మిగిలాయని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేస్తున్న ఏడిఈ,ఏఈలు బదిలీపై వెళ్లినప్పటికీ నేటికీ కొత్త అధికారులను నియమించలేదని దుయ్యబట్టారు.పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాలకే బదిలీల ప్రాదాన్యత ఉంటుందని ప్రభుత్వం ప్రకటించి నప్పటికీ.గోదావరీ పరివాహక,ఎజెన్సీ గ్రామీణ వాతావరణానికి చెందిన చర్ల మండలానికి చెందిన ఎఇ ని అత్యవసరంగా ఎందుకు బదిలీ చేయవలసి వచ్చిందో..బదిలీ చేసి మరొక అదికారిని తక్షణమే ఎందుకు నియమించలేదో వరంగల్ జోన్ సిఎండీ తెలియజేయాలని అన్నారు.చర్ల ప్రాంతానికి సబ్ ఇంజనీర్ నియామకం అవసరమైనప్పటికీ ఇప్పటికీ నియమించకపోవడమెనుక ఆంతర్య మేమిటని, ఏజెన్సీ ప్రాంత ప్రజల అవసరాలు,కష్టాలు అధికారులకు,ఫ్రభుత్వాలకు పట్టవా అని నిలదీశారు. తక్షణమే చర్ల మండలానికి ఎఇ ని నియమించాలని లేని ఎడల ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.