సిరా న్యూస్, బోథ్
దేశం కోసం రాజీవ్ గాంధీ ఎంతో కృషి: మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి
భారతదేశ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థను, మున్సిపల్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ఆయన కృషి కొనియాడారు. ముఖ్యంగా యువతకు ఓటు హక్కు కల్పించాలని దృక్పథంతో 21 సంవత్సరాలు వయస్సు ఉంటే 18 సంవత్సరాల కుదించి యువతకు ప్రాధాన్యతనిచ్చారన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు కురుమే మహేందర్, షేక్ రజియా బేగం, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చంటి, ఏఎంసీ డైరెక్టర్లు అబ్రాస్, మాజీ వార్డు సభ్యులు శేఖర్, షేక్ షాకీర్, మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ రహీముద్దీన్, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు