సిరా న్యూస్;
బుల్డోజర్ పేరు మీరు చాలాసార్లు విని ఉంటారు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడల్లా బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. బుల్డోజర్ ఒక శక్తివంతమైన యంత్రం. ఇది అందరికీ తెలుసు. బుల్డోజర్ 90ల పిల్లలకు కూడా ఇష్టమైన వాహనం. ఇది తవ్వకాలకు, చెత్తను తొలగించడానికి, ఆక్రమణలను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో బుల్డోజర్ అనే పదం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే దీని అసలు పేరు మీకు తెలుసా? బుల్డోజర్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..ప్రస్తుతం తెలంగాణలో ఈ బుల్డోజర్ ఫీవర్ కొనసాగుతోంది. బుల్డోజర్ చర్యకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీని తదుపరి విచారణ సెప్టెంబర్ 17, 2024న జరగనుంది. అయితే, ఈ బుల్డోజర్ వాహనం అసలు పేరు ఇది కాదని మీకు తెలుసా? ఇతర వాహనాలతో పోలిస్తే దీని మైలేజీని కూడా భిన్నంగా కొలుస్తారు.భారతదేశంలో అత్యధికంగా బుల్డోజర్లను విక్రయించే కంపెనీ జేసీబీ. కానీ చాలామంది బుల్‌డోజర్ అంటే జేసీబీ అని అర్థం చేసుకుంటారు. పసుపు రంగు బుల్డోజర్‌పై నలుపు రంగులో జేసీబీ బ్రాండ్ పేరు రాయడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.. ఇది కాకుండా ఇతర కంపెనీలు కూడా బుల్డోజర్లను విక్రయిస్తాయి. మార్కెట్లో అనేక రకాల బుల్డోజర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి కెపాసిటీ, మైలేజీ, ధర మొదలైన వాటిలో తేడా ఉంటుంది. బుల్డోజర్ అసలు పేరు బ్యాక్‌హో లోడర్. బుల్డోజర్ లేదా బ్యాక్‌హో లోడర్ కోసం ‘మైలేజ్’ అనే పదాన్ని కొద్దిగా భిన్నంగా ఉపయోగిస్తారు. దేశంలో వివిధ రకాల బుల్డోజర్ యంత్రాలు పనిచేస్తాయి.మెషీన్‌లు వివిధ మోడల్‌లలో వస్తాయి.కార్లు లేదా బైక్‌ల మాదిరిగా కాకుండా వాటి మైలేజీని లీటర్‌కి కిలోమీటర్లలో లెక్కించరు. బదులుగా, బుల్డోజర్ ఒక గంటలో ఉపయోగించే డీజిల్ మొత్తాన్ని కొలుస్తారు. బుల్‌డోజర్‌కి మైలేజ్ ఎంత అనేది అది గంటసేపు నడిచినప్పుడు ఉపయోగించే డీజిల్ మొత్తాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. బుల్‌డోజర్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు అయినంత మాత్రాన ఇల్లు కూల్చివేయాలా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. బుల్‌డోజర్ న్యాయాన్ని నిలదీస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ దుశ్యంత్ దావే వాదించారు. దేశవ్యాప్తంగా ఈ బుల్‌డోజర్ న్యాయాన్ని అమలు చేయాలని చూస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ న్యాయాన్ని తప్పుబట్టింది. నేరం చేసినంత మాత్రాన ఆ వ్యక్తి ఆస్తుల్ని ధ్వంసం చేయడం సరికాదని తేల్చి చెప్పింది. ఆ ఇంటి నిర్మాణం అక్రమం అని తేలినప్పుడే ధ్వంసం చేయాలని స్పష్టం చేసింది. దీనిపై కచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు అని తేలినప్పుడు ముందు నోటీసులు ఇవ్వాలని, వాళ్లు స్పందించని పరిస్థితుల్లో చట్టానికి లోబడి ధ్వంసం చేయాలని తేల్చి చెప్పింది. “ఇళ్లు కూల్చివేయాలంటే అంత కన్నా ముందు కచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. కేవలం ఓ నేరం చేసినంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా. ఒకవేళ అది అక్రమ నిర్మాణం అని తేలితే పరవాలేదు. కానీ కేవలం నిందితుడు అన్న కారణానికి ఇల్లు కూల్చివేస్తామనడం మాత్రం సరికాదు. ఈ విషయంలో కచ్చితంగా ఓ విధానాన్ని అనుసరించాలి. మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తేనే కూల్చివేస్తున్నామని మీరు చెబుతున్నారు. అయితే…అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తప్పకుండా ఉండాలి”- సుప్రీంకోర్టు ధర్మాసనం . పిటీషనర్ల తరపున అడ్వకేట్ దుశ్యంత్ దావే, సీయూ సింగ్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చేపట్టిన కూల్చివేతల గురించి ప్రస్తావించారు. 50,60 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లనూ కూల్చివేస్తున్నారని చెప్పారు. కొన్ని కేసులనూ ఈ సందర్భంగా ఉటంకించారు. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ఘటన జరిగింది. ఓ విద్యార్థి తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంటనే అధికారులు ఆ నిందితుడి ఇల్లు కూల్చి వేశారు. దీనిపైనే అడ్వకేట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “కొడుకు తప్పు చేస్తే తండ్రి కట్టుకున్న ఇల్లుని కూల్చివేయడమేంటి” అని ప్రశ్నించారు. ఇది సరికాదని స్పష్టం చేశారు. నేరస్థులు అని నిర్ధరణ అయినప్పటికీ ఇళ్లు కూల్చివేసే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ బుల్‌డోజర్ జస్టిస్‌పై ఎన్నో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇదేం న్యాయం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్దతునిచ్చే వాళ్లు ఉన్నప్పటికీ అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. మరో వైపుమాజ్ వాదీ పార్టీ 2017లో అధికారంలోకి వస్తే అన్ని బుల్డోజర్లను గోరఖ్‌పూర్ వైపు నడిపిస్తామని అఖిలేష్ యాదవ్ మంగళవారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్ కావడంతో ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అఖిలేష్ హెచ్చరికలను యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో తిప్పికొట్టారు. బుల్డోజర్ నడపడానికి ధైర్యం, తెలివితేటలు, దృఢ సంకల్పం ఉండాలని, ఆ లక్షణాలేవీ యాదవ్‌లో లేవని అన్నారు. ”అందరి చేతులు బుల్డోజర్ నడపడానికి పనికి రావు. దానికి ధైర్యం, తెలివితేటలు (దిల్, దిమాగ్) ఉండాలి. సమర్ధత, దృఢ సంకల్పం ఉన్నవాళ్లే బుల్డోజర్ నడపగలరు. అల్లర్లు సృష్టించేవారి ముందు మోకరిల్లేవారు బుల్డోజర్ ముందు నిలవలేరు” అని కౌంటర్ ఇచ్చారు.అఖిలేష్ యాదవ్‌ను ‘టిప్పు’ అనే నిక్‌నేమ్‌తో యోగి సంబోధిస్తూ, టిప్పు ఇప్పుడు సుల్తాన్ కావాలని ప్రయత్నిస్తున్నారంటూ చురకలు వేశారు. 2017లో బీజేపీ అధికారంలోకి రాకముందు యూపీలో ‘ఆటవికపాలన’ ఉండేదన్నారు. అఖిలేష్ యాదవ్, ఆయన అంకుల్ శివపాల్ యాదవ్‌లు బలవంతపు వసూళ్లు చేసేవారని, ఏరియాలు పంచుకుని మనీ లూటీలకు పోటీ పడేవారని ఎద్దేవా చేశారు.