సిరా న్యూస్,కళ్యాణదుర్గం;
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం, మల్లిపల్లి గ్రామంలో అమ్మ వారి ఆలయంలో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు దేవాలయంలోకి చొరబడి సీసీ కెమెరా పగలగొట్టి గర్భగుడి వాకిలి తెరిచి అమ్మవారి నగలు తో పాటు హుండి ను కూడా ఎత్తుకెళ్లి, గుడికి కొంత దూరంలో హుండి పగలగొట్టి అందులో ఉన్న డబ్బును దోచుకెళ్లారు.
గ్రామస్తులు మాట్లాడుతూ హుండీలో డబ్బులు దాదాపుగా 50 వేల రూపాయలు ఉంటాయని అలాగే అమ్మ వారి నగలు 15 కేజీల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. కల్యాణదుర్గం మండలం రూరల్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ – అనంతపురం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో కలిసి పనిచేస్తూ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.