సిరాన్యూస్, ఆదిలాబాద్
జేఎన్టీయూ కళాశాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు బుట్టి శివకుమార్
బీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
జేఎన్టీయూ కళాశాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు బుట్టి శివకుమార్ అన్నారు.
బుధవారం బీ ఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు ఫై కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బి ఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బుట్టి శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యతో పాటు విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి కార్యాచరణ రూపొందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న కృషితో వ్యవసాయ ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు లభించిన ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ మొదలెట్టకపోవడం సిగ్గుచేటు అన్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం జిల్లాను అన్ని రంగాలలో ముందుండేలా అభివృద్ధి చేసేందుకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల తో పాటు కేజీ టు పీజీ ఉచిత విద్య, జిల్లాకు మెడికల్ కాలేజ్, గురుకుల పాఠశాలలో. రెసిడెన్షియల్, కార్పొరేటర్ స్థాయిలో విద్య పోషకాహారాన్ని అందించడమే కాకుండా స్థానికంగా ఉద్యోగాలు పొందేలా 40 కోట్లతో ఐటి టవర్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం జేఎన్టీయూ కళాశాలకు ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకోలు చేపట్టివిద్యార్థుల పక్షాన ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు బుట్టి శివకుమార్, కౌన్సిలర్ పవన్ నాయక్, విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు వాగ్మా రే ప్రశాంత్,అబ్దుల్లా, మోసిన్, సోయబ్, కళ్యాణ్,ఆదర్శ్, కలిమ్ తదితరులు పాల్గొన్నారు.