సిపిఐ
సిరా న్యూస్,విజయవాడ;
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మతపరమైన విభజన సృష్టించి లబ్ధి పొందేందుకు బిజెపి పన్నిన కుట్ర. ప్రజాతంత్ర, లౌకికవాదులు బిజెపి కుటిల యత్నాలను ఖండించాలి. సిఎఎ అమలుపై లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న టిడిపి, వైసిపిల వైఖరి వెల్లడించాలని అయన అన్నారు.