పైన కేఫ్……. లోపల హుక్కా సెంటర్

సిరా న్యూస్,హైదరాబాద్;
పైకి బోర్డు మాత్రమే చిలాక్స్ కేఫ్ అని చూపిస్తూ.. లోపల గుట్టు చప్పుడు కాకుండా హుక్కా దందా చేస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఒకప్పుడు హుక్కా అంటే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి రిచ్ ఏరియాల్లో గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్‌గా బడా బాబులకు మాత్రమే యాక్సెస్ ఉండేవి.కానీ, రోజురోజుకూ మారుతున్న కాలానుగుణంగా గంజాయితో పాటు హుక్కా సెంటర్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గల్లీగల్లీకి హుక్కా కల్చర్ విస్తరించిపోయింది. పోలీసులు పలుమార్లు దాడులు నిర్వహించి కేసులు పెట్టినా తగ్గడం లేదు. ఏకంగా కొంతమంది నిర్వాహకులు పైకి బోర్డు మాత్రం వేరేది తగిలించి లోపల హుక్కా సెంటర్లు నిర్వహిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ కేఫ్ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో పోలీసులకు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలాక్స్ కేఫ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా హుక్కా నడుపుతున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలోనూ రెండు సార్లు హుక్కా నడుపుతూ దొరిక్కినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *