సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
నాయకుడిగా కాదు సేవకుడిలా వచ్చా.. భూక్యా జాన్సన్ నాయక్..
తాను నాయకుడిగా కాదు, ప్రజల సేవకుడిలా వచ్చానని భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు . శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని తాను అండగా ఉంటానని అన్నారు. గెలుపైన ఓటమైన ప్రజలతోనే ఉంటానని పేర్కొన్నారు. తనను ఎంతగానో అభిమానించి, తనతో నడిచిన ఇంద్రవెల్లి ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుతి డోంగ్రే, జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎం ఏ అంజద్, మీర్జాజిలాని, ఎంపీపీ పోటీ శోబాబాయ్, ఎంపిటిసి మాడవి భీంరావు, ఎంపీటీసీ ఆశా బాయ్ సర్కాలే, నాయకులు మోహన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.