సిరా న్యూస్,సికింద్రాబాద్;
కంటోన్మెంట్ విలీనంపై నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సంచలన వ్యాఖ్యలుచేసారు. 80శాతం మంది ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారు. విలీనం వలన కంటోన్మెంట్ ప్రజలకు జరిగే లాభల కంటే ఎక్కువ నష్టాలే. కంటోన్మెంట్ ప్రజలు కోరుకుంటుంది నీళ్లు,నిధులు, అభివృద్ది. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కావలసింది కంటోన్మెంట్ ప్రజలు కాదు భూముల కోసమే విలీనం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విలీనంలో కేవలం సివిల్ ప్రాంతాలను మాత్రమే ఇస్తానంది . ఆర్మీ భూములు కావాలంటే వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిందే. విలీనం అయితే సస్యశ్యామలంగా ఉన్న కంటోన్మెంట్ కాంక్రీట్ జంగిల్ గా మారుతుందని అన్నారు.
=====