సిరా న్యూస్,హైదరాబాద్;
గోల్కోండ పోలీసు పరిధిలోని ఇబ్రహీం బాగ్ లో ఒక కారు బీభత్సం సృష్టించింది.ఘటన లో ఒక చిన్నారి మృతి చెందింది. కారు రాంగ్ రూట్ లో ర్యాష్ గా దూసుకొచ్చింది. ముందు వెళుతున్న బైక్ ను ఢీ కొట్టింది. బైక్ పై వెళుతున్న చిన్నారి మృతి చెందగా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెపుతున్నారు. స్పాట్ కు చేరుకున్న గోల్కొండ పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.