సిరా న్యూస్,విశాఖ;
గోపాలపట్నంలో పెట్రోల్ బంక్ కూడలిలో టాటా ఇండిగో కారులో మంటలు చేలరేగాయి. బ్యాటరీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. బ్యాటరీ డైనమా నుంచి మంటలు రావడంతో కారు పూర్తిగా కాలిపోయిందని కారు యజమాని తెలిపారు. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండటంతో అప్రమత్తమైనా స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు…