కారు – లారీ ఢీ

లోయలో పడ్డ లారీ
ఆరుగురు దుర్మరణం
సిరా న్యూస్,కడప;
కడప – రాయచోటి వెళ్లే జాతీయ రహదారి గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరియు లారీ డ్రైవర్ తో సహా మొత్తం ఆరుగురు అక్కడకక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *