సిరా న్యూస్,డోన్;
నంద్యాల జిల్లా డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెదేపా నాయకుల పై కేసులు పెట్టి, రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నారు.ఎన్నికల సమయంలో కోట్ల సమక్షంలో ప్యాపిలికి చెందిన కేడీసీసీ డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్వో మల్లారెడ్డి కుటుంబం, సీమ సుబ్బారెడ్డి వైకాపా వీడి తెదేపా లో చేరారు.పార్టీ మారి నందుకు ఆర్థిక మంత్రి వీరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయంచారని టీడీపీనేతలు ఆరోపించారు. సీమ సుధాకర్ రెడ్డి, సీమ సుబ్బారెడ్డి, సీమ ఏకాంత రెడ్డి, విఆర్వో మెట్టు మల్లా రెడ్డి, మెట్టు రాజశేఖర్ రెడ్డి, మెట్టు మనోహర్ రెడ్డి లను మొత్తం ఆరుగురిని ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి, బనగానపల్లె స్టేషన్ కు తరలించారు.సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని లేకుంటే డిఎస్పి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పడంతో పోలీసులు కోట్ల సుజాతమ్మ ఇంటి వద్ద భారీగా మోహరించారు.
కోట్ల ఇంటి లోపలికి వెళ్లి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున నిరసనలు, ఆందోళన వద్దంటూ సి.ఐ ప్రవీణ్ కుమార్,,ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని, కోట్ల సుజాతమ్మ, సూర్య ప్రకాష్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది మంచి పద్ధతి కాదని చట్టపరంగానే పోవాలని సూచించిన తెదేపా డోన్ అభ్యర్థి సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు.
===================