సిరా న్యూస్,కమాన్ పూర్;
స్వంత గ్రామం పై మమకారంతో, తన తండ్రి దివంగత ప్రభుత్వ పాఠశాల ప్రధానాచార్యులు సౌమిత్రి నారాయణచార్యుల జ్ఞాపకంగా హైద్రాబాద్ చిలుకలగూడ కట్టా మైసమ్మ ప్రధాన పూజారి సౌమిత్రి తిరుమలచార్యులు కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలకు బడిగంట, విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులతోపాటు, 35వేల ఖరీధుగల షూలు, సాక్సులు, పరీక్ష ప్యాడులను అందజేశారు. అంతేగాక విద్యార్థులను ప్రోత్సహిస్తూ యస్.యస్.సి ఫలితాలలో మొదటి మూడు ర్యాంకర్లకు ప్రోత్సాహక బహుమతి, అభినందన పురస్కారంగా ముగ్గురికి కలిపి పదివేల రూపాయలు గత యేడు ప్రకటించారు
కాగా మొదటి బహుమతి కారుపాకల అమల-శ్రీనివాస్ దంపతుల కూతురు కీర్తన (8.8జిపిఏ) కు 5,000/-, రెండవ బహుమతి యాదగిరి రమ-కుమారస్వామి కూతురు భావన (8.5జిపిఏ)కు 3000/-, మూడవ బహుమతి కందికట్ల స్వప్న-శ్రీనివాస్ కూతురు అంకితకు 2000/-లను ఈ స్వాతంత్ర్య దినోత్సవం పాఠశాల వేడుకలలో తన తల్లిగారైన సౌమిత్రి సుగుణమ్మ గారిచేత అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానచార్యులు శోభన్ రావు, ప్రాథమిక పాఠశాల ప్రధానాచార్యులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జడ్పీటీసి గంట వెంకటరమణరెడ్డి, పాఠశాల అమ్మ ఆదర్శ కమిటి చైర్మెన్ బొనగాని హారిక, మాజీ యంపీటీసీ కొట్టె సందీప్, మాజీ సర్పంచ్ దేవ రామస్వామి, పురప్రముఖులు కొలిపాక సారయ్య, ముచ్చకుర్తి శ్రీనివాస్, మేకల మారుతి, రొడ్డ సంపతి, శావ సురేష్ సిద్ధూ, రేండ్ల సుధాకర్, పంచాయతి కార్యదర్శి శ్రీధర్, పాఠశాల ఉపాధ్యాయిలు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.