Cast Vote With One Month Old Child: నెల రోజుల బాబుతో పోలింగ్‌ కేంద్రానికి..

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది జోండలే అజయ్‌ కుమార్‌ (Ajay Kumar) తన నెల రోజుల కుమారుడు, సతీమణీతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. ఈ మేరకు గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఆయన తన సతీమణీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన వరం ఓటు హక్కు అని అన్నారు. ఇలాంటి అమూల్యమైన ఓటు హక్కును ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకొని, బాధ్యత గల పౌరులుగా తమ విధిని నిర్వర్తించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *