సిరా న్యూస్, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు, ఇటీవలే కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మద్యంతర బెల్ పై బయట ఉన్న చంద్రబాబుకు హైకోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడంతో భారీ ఊరట లభించింది.