సిరా న్యూస్,కూకట్ పల్లి;
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కులగణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించారు. ఇప్పుడు ఎ మోహంతో రేవంత్ రెడ్డి సర్వె చేపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల ల వివరాలు ఎలా సేకరిస్తారని నిలదీసారు. గడువులోపు సర్వే పూర్తీ చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని కోరారు. మొదట ప్రజాప్రతినిధుల వివరాలు సేకరిచే కంటే ప్రజల వివరాలు సేకరించాలని సూచించారు. ప్రజలకు సర్వే పేరిట అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు.