సిరా న్యూస్,న్యూఢిల్లీ ;
నాగార్జునసాగర్‌పై ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో జరుగనున్న సమావేశానికి ఫిజికల్‌గా హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. అయితే తొలుత 6న సమావేశం ఉంటుందని లేఖలో చెప్పినప్పటికీ తుఫాను కారణంగా ఈ భేటీని 8కి వాయిదా వేసినట్టు కేంద్ర జలవనరుల శాఖ సమాచారం ఇచ్చింది