సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా కేంద్రంలో చైన్ స్నాచిoగ్ కు పాల్పడిన వ్యక్తిని స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్ధానిక నలంద జూనియర్ కళాశాల సమీపంలో.. నడుచుకుంటూ వెళ్తూన్న ఓ మహిళ మెడ లోంచి రెండున్నర తులాల బంగారం గొలుసును.. బైక్ మీద వచ్చిన అపరిచితుడు చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యాడు. దీంతో.. వెంటనే తేరుకున్న మహిళా గట్టిగా కేకలు వేయడంతో.. కొందరు యువకులు వెంబడించి పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చైన్స్ మ్యాచింగ్ విషయాన్ని తెలియజేశారు. ఇక.. స్థానికులు అంతా సదరు యువకులను శభాష్ అని మెచ్చుకున్నారు.