లవర్స్ కాదు… భార్యాభర్తలు
సిరా న్యూస్,నల్గోండ;
నల్గొండ జిల్లా మర్రిగూడెంలో చైన్ స్నాచింగ్ చేసిన జంటను పోలీసులు అరెస్టు చేసారు. శుక్రవారం సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై ఎక్కించుకొని వెళ్లిన జంట సునీత మెడలో ఉన్న ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారు. స్థానికులు వెంబడించిన అక్కడి నుండి హైదరాబాద్ కి జంట పారిపోయింది. హైదరాబాద్ సంతోష్ నగర్ వద్ద స్కూటీ పై పారిపోతున్న జంటను పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టుబడ్డ ఇద్దరు వెంకటేష్, అతని భార్య గా పోలీసులు గుర్తించారు. వ్యసనాల అలవాటై చోరీలకు పాల్పడుతున్న దంపతులుగా పోలీసులు గుర్తించారు..