సిరా న్యూస్,రంగారెడ్డి;
సైబరాబాద్ కమిషనరేట్ కు కూత వేటు దూరంలోనే దొంగలు స్నాచింగ్ చేసారు. మాదాపూర్ యశోద హాస్పిటల్ ముందు బైక్ పై వచ్చి మహిళా మెడలో నుంచి మంగళసూత్రాన్ని స్నాచర్లు ఎత్తుకెళ్లారు. బాధిత మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డుపై కింద పడిపోవడంతో మహిళా కాలు విరిగింది. పోలీసులు యశోద హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. మాదాపూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.