సిరాన్యూస్, చిగురుమామిడి
రూ. 11.50కోట్ల ఋణాలను రైతులకు అందించాం: సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి
* రుణాలు సకాలంలో చెల్లించి సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలి
రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కింద 11కోట్ల 50లక్షల రూపాయల ఋణాలను రైతులకు అందించామని సింగిల్ విండో ఛైర్మెన్ జంగ రమణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల సహకార సంఘం అర్ధ వార్షిక మహాసభను చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి అధ్యక్షతన మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులకు దాదాపుగా 11కోట్ల 50లక్షలు రూపాయలను దీర్ఘ కాలిక,స్వల్ప కాలిక ఋణాల రూపంలో అందించామని పేర్కొన్నారు.గత యాసంగి సీజన్ ల్లో ప్యాడి సెంటర్ల ద్వారా 1,40,528.40క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసామన్నారు.రైతులు కోళ్ల పరిశ్రమకు, పాడి పరిశ్రమకు ఇతర వ్యాపారాలకు ఋణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.అలాగే రైతులు సంఘం ద్వారా అందించే ఎరువులు, విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.సంస్థ ద్వారా గునుకులపల్లిలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్,మండల కేంద్రంలోని కార్యాలయంపైన నిర్మించిన మొదటి అంతస్థు నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయని,త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని తెలిపారు.రైతులు తీసుకున్న ఋణాలను సకాలంలో చెల్లించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని చైర్మన్ రమణారెడ్డి కోరారు.సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు కరివేద మహేందర్ రెడ్డి,నోడల్ ఆఫీసర్ వనజ,సంఘం డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, అందే స్వామి, చిటుమల్ల శ్రీనివాస్, ముద్రకోల రాజయ్య, పోతరవేని శ్రీనివాస్ యాదవ్, పెరాల లక్ష్మి, మాచమల్ల లక్ష్మి, బండి లక్ష్మి, సొసైటీ సీఈఓ నర్సయ్య,సంఘ సభ్యులు, రైతులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.