సిర్యానూస్, ఖానాపూర్
జెకేనగర్ కాలనీలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* లో వోల్టేజ్ విద్యుత్ సమస్య పరిష్కారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో సోమవారం రాత్రి ఖానాపూర్ పట్టణంలోని జెకె నగర్ కాలనీలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్య వల్ల కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీవాసుల కోరిక మేరకు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం విద్యుత్ అధికారులతో మాట్లాడి నూతన నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించారు. ఈసందర్బంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ లో వోల్టేజ్ విద్యుత్ సమస్య వల్ల బోరు మోటర్లు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు పనిచేయడం లేదని కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాలనీ వాసుల కోరిక మేరకు నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించామని అన్నారు. రాత్రనక పగలనకా ఖానాపూర్ పట్టణ ప్రజల కోసం వారి సమస్యను చెప్పగానే వారి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్‌ను కాలనీవాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, జీకే నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.