సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
జిల్లాలో ఈనెల 5 నుంచి నిర్వహించే స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు, వార్డు స్పెషల్ ఆఫీసర్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగబోయే స్వచ్ఛధనం – పచ్చదనం కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఖానాపూర్ పట్టణంలో ఉన్న 12 వార్డులలో వార్డు కౌన్సిలర్లతో కలిసి ఏడు రోజులు ఏడు కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.