సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో మొదటి రోజున ప్రజలకు ఇంటి పరిసరాలు పరిశుభ్రతపై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో బస్ స్టాప్ లలో పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావాలి సంతోష్ ,కౌన్సిలర్స్ , నాయకులు జన్నారపు శంకర్ , అమానుల్లా ఖాన్ , అబ్దుల్ ఖలీల్ , షబ్బీర్ పాషా , మున్సిపల్ కమిషనర్ మనోహర్ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది, వైద్య సిబ్బంది, మెప్మా అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.