Chairman Rajura Satyam: విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాలి:  మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాలి:  మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం
* పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టిక ప‌రిశీల‌న

పారిశుద్ధ్య కార్మికుల విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం ఉదయం 5 గంటలకు పారిశుద్ధ్య కార్మికుల యొక్క హాజరు పట్టికను ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సక్రమంగా విధులను నిర్వహించాలని, వ‌ర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వార్డులలో ఎటువంటి పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు మనల శంకర్ , పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *