సిరా న్యూస్,ఖానాపూర్
ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కుటుంబ సభ్యులతో కలసి ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరూ వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పాత టైర్లు, కూలర్లు, ప్లాస్టిక్ డబ్బాలు ,పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. నిల్వ ఉన్న నీటిపై అనేక రకమైన బ్యాక్టీరియా, దోమలు ఏర్పడుతాయని తెలిపారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులకు గురికాకుండా చూసుకోవాలని అన్నారు.