సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
తాగునీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం 12వ వార్డు సుభాష్ నగర్ కాలనీలోని గోండు గూడెంలో మిషన్ భగీరథ తాగు నీరు రావడం లేదని స్థానిక కౌన్సిలర్ మొన్న మున్సిపల్ చైర్మన్ కు తెలియజేశారు. గురువారం వెంటనే స్పందించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం గాంధీనగర్ వాటర్ ట్యాంక్ నుండి వెళ్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్ కు సుభాష్ నగర్ కాలనీ నుండి నూతన పైపులైను ఏర్పాటు చేయించారు. కాలనీకి నీరు వెళ్ళేటట్లుగా చేయించారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల కోసం పనిచేస్తున్న మున్సిపల్ చైర్మన్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , నాయకులు రోహిదాస్, మున్సిపాలిటీ అధికారులు వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.