సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఉద్యోగులను సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను మున్సిపల్ చైర్మన్ చైర్మన్ రాజుర సత్యం సన్మానించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పురపాలక సంఘం కార్యాలయంలో పలువురు ఉద్యోగులను ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్ని రోజులు ఉద్యోగులు చేసిన సేవలను కొనియాడారు. మరింత అంకితభావంతో పని చేస్తే చిన్న స్థాయి ఉద్యోగం నుండి పెద్ద స్థాయి ఉద్యోగం వరకు చేరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయకులు కారింగుల సంకీర్తన సుమన్ , జన్నారపు విజయ లక్మీ శంకర్ , నాయిని స్రవంతి సంతోష్ ,పరిమి లత సురేష్ , ఆఫ్రిన్ అమనుల్ల ఖాన్ , కిషోర్ నాయక్ ,అబ్దుల్ ఖలీల్ , కుర్మా శ్రీనివాస్ ,పౌజియ షబ్బిర్ పాష , కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు