సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
న్యాయవాది ఖదీర్‌ను పరామర్శించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం పద్మావతి నగర్ కాలనీకి చెందిన న్యాయవాది ఖదీర్ రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్ గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మంగళవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , కిషోర్ నాయక్ , షబ్బీర్ పాషా ,తదితరులు పాల్గొన్నారు.