సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సెంట్రల్ లైటింగ్‌కు మరమ్మతులు మున్సిపల్ చైర్మన్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోనీ ప్రధాన రహదారి మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభాల యొక్క లైట్లను మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన దహదారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాల యొక్క లైట్లు రాక చీకట్లో వాహనదారులు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని క్రేన్ సహాయంతో మున్సిపాలిటీ ఎలక్ట్రిషన్ సిబ్బందితో లైట్లు మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు శ్రీనివాస్, రమేష్, తది తరులు పాల్గొన్నారు.