సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
మహాలక్ష్మి అమ్మవారి పండుగలో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పండుగ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తిమ్మాపూర్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఈసందర్భంగా పోతురాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , పెద్దలు బిసి రాజన్న, కడుకుంట్ల నరసింహులు, కడుకుంట్ల రవి, బక్క శెట్టి లక్ష్మణ్, బక్క శెట్టి కిషోర్, కరిపే శ్రీనివాస్, ధ్యావతి రాజేశ్వర్,రమేష్, శేషాద్రి, రాము, శ్రీహరి, పట్టణ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.