సిరా న్యూస్,భూపాలపల్లి;
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా, భూపాలపల్లి బస్టాండ్ దగ్గర రజక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ అని, వారందించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని అన్నారు. అణిచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు..