సిరాన్యూస్, చిగురుమామిడి
బడీడు పిల్లలను పనిలో ఉంచితే చర్యలు: లేబర్ ఆఫీసర్ చక్రధర్ రెడ్డి
* చిగురుమామిడిలోని హోటళ్లలో తనిఖీలు
బడీడు పిల్లలను పనిలో ఉంచితే కఠిన చర్యలు ఆపరేషన్ ముస్కాన్-10 బృంద సభ్యులు, లేబర్ ఆఫీసర్ చక్రధర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం చిగురుమామిడి మండల కేంద్రంలో వివిధ హోటళ్ళు కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ లో పనిచేస్తున్న యువకుడి వివరాలు అడిగి తెలుసుకొని వారి ఆధార్ కార్డులను తనిఖీ చేశారు.వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 31 తేది వరకు పదో విడత ఆపరేషన్ ముస్కన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పిల్లలతో పనులు చేయిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేయడంతో పాటు వీధి బాలురు, తప్పిపోయిన చిన్నారులు బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పిస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఏఆర్ ఎస్ఐ కరీం, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ విజయసాగర్, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.