సిరా న్యూస్,అమరావతి;
సర్పంచుల సంఘం “చలో అసెంబ్లీ” ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు ప్రయత్నించారు. అసెంబ్లీకి వెళ్లే మార్గంలో సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేసారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్పంచులను లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు సర్పంచులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం దారిమళ్లించిందంటూ నినాదాలు చేసారు.