సిరాన్యూస్, సైదాపూర్
హనుమాన్ ఆలయంలో మాజీ సర్పంచ్ చంద శ్రీనివాస్ ప్రత్యేక పూజలు
* భక్తులకు అన్నదానం
హనుమాన్ జయంతి సందర్భంగా సైదాపూర్ మండలంలో వెన్కేపల్లి మాజీ సర్పంచ్ చంద శ్రీనివాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయన మాట్లాడుతూ ధర్మరక్షణ దుష్టశిక్షణ ధర్మ పోరాటాలలో చెడును నాశనం చేసి హనుమంతుడు మన జీవితాల్లో అన్ని కష్టాలను తొలగిస్తాడని, ఏ సమస్య వచ్చినా, భయం వచ్చినా హనుమాన్ చాలీసా చెబితే ఆ సమస్య పోయి ధైర్యం వస్తుందని అన్నారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.