దొంగ హామీలిస్తున్న చంద్రబాబు

సిరా న్యూస్,పెనమలూరు;
పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వైఎస్సార్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ మంచి చేస్తున్నాడు కాబట్టే ప్రజల మనసుల్లో జగన్ స్తానం సంపాదించారన్నారు .చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చెయ్యలేక తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ను వెంటేసుకుని తిరుగుతున్నాడు. చంద్రబాబు ఇంటింటికి కిలో బంగారం,బెంజ్ కారు అంటూ దొంగహామీలు ఇస్తున్నాడు . 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు రైతులను,నిరుద్యోగులను,డ్వాక్రా మహిళలను మోసం చేసాడు. 2014 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీ కలిసి పోటీ చేశారు. ఇప్పుడేదో కొత్తగా వస్తున్నట్టు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు సైనికుల్లా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కృషి చెయ్యాలి అని పిలుపు ని ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన దగ్గరనుంచి జగన్ 124 సార్లు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు. మీరు కేవలం 2సార్లు బటన్ నొక్కి వైసీపీ ఎమ్మెల్యే ని, ఎంపీని గెలిపించాలి అని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *