ఎంపి కేశినేని నాని
సిరా న్యూస్,విజయవాడ;
పేదల కోసం జగన్ పని చేస్తారు,,ధనికుల కోసం చంద్రబాబు పని చేస్తారని ఎంపి కేశినేని నాని అన్నారు. సమాజం కోసం జగన్ పని చేస్తే పనికిరాని కొడుకు నీ ముఖ్యమంత్రి చేయటం కోసం పని చేసే వ్యక్తి చంద్రబాబు. ఎల్లో మీడియా లో వార్తలు చదివి జగన్ పై నాకు అనుమానాలు ఉండేవి. వాస్తవాలు తెలుసుకుంటే జగన్ గొప్పతనం తెలిసిందని అన్నారు.2.50 లక్షల కోట్లు పేద ప్రజలు కోసం జగన్ ఉపయోగించారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద కార్యక్రమాలూ ఎవరు చేయలేదు. ఈ మాటలు నా గుండెల్లో నుంచి వచ్చాయని అన్నారు.
జీతాలు లేవు రావు అని వార్తలు చదివి నిజమే అనుకునే వాడిని కానీ ఏ పథకం ఇప్పటి వరకు ఆగలేదు. రోడ్లు బాగోలేదు అంటారు ఆ రోడ్లు ఎక్కడ ఉన్నాయో కనపడవు. ప్రభుత్వం పై నెగిటివ్ ప్రచారానికి మూల కారణం చంద్రబాబు. ఎన్నో దేశాలు తిరిగాను కానీ జగన్ లాంటి నాయకుడిని చూడలేదని అన్నారు. కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు చేయలేకపోయాడు. అమరావతి లేదు,అంబేద్కర్ విగ్రహం కడతాను అన్నాడు అది లేదు. బోగస్ మాటలు చెప్పే వ్యక్తి చంద్రబాబు. అంబేద్కర్ స్మృతివానం పర్యాటక కేంద్రంగా జగన్ మార్చాడు. విద్యార్థులు బాగా చదువుకోవాలి అని జగన్ కోరిక. ఆరోగ్యానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపించాడు అవినాష్. నెహ్రు ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన ఘనత అవినాష్ సొంతం. గతంలో కట్ట మీద ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. నియోజకవర్గంలో అభివృధి జరిగిందంటే అవినాష్ పడిన కష్టమే కారణం. అవినాష్ పాతిక వేల మేజర్టితో గెలుస్తాడని అయన అన్నారు.