సిరా న్యూస్, ఆదిలాబాద్
మట్కా నిందితుడి అరెస్ట్
సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్
* రూ 11,100/- నగదు, మట్కా చిట్టీలు స్వాధీనం
*ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
* అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలి
అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలంటే జిల్లా ప్రజల సహకారం ఎంతగానో అవసరమని ఆదిలాబాద్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం స్థానిక పట్టణంలోని స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్నారనేవిశ్వసనీయ సమాచారంతో దాడి చేయగా సంఘటనా స్థలంలో కుర్షిత్ నగర్ కు చెందిన షేక్ రాఫీక్ వద్ద మట్కా నిర్వహిస్తుండగా పట్టుబడ్డారని తెలియజేశారు. ఇతని వద్దనుండి రూ 11,100/- నగదు, మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకొని ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.