సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని అధికారికంగా మార్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్లుగా పోలీస్ శాఖలోనూ అధికారులు లోగోలను మారుస్తున్నారు.అందులో భాగంగానే ఇప్పటి వరకు టీఎస్ ఎస్పీ, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ,గా ఉన్న లోగోను టీజీఎస్పీ, తెలంగాణ స్పెషల్ పోలీస్,గా మార్చారు.
టీజీ ఎస్పీ లోగో మార్పును ఆ విభాగం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. టీఎస్ ఎస్పీ బెటాలియన్ల లోగోలు సైతం టీజీ ఎస్పీ బెటాలియన్లుగా లోగోల్లో మార్పులు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్లుగా త్వరలోనే పోలీస్ శాఖలోని మిగతా విభాగాల లోగోల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
=========