తాడేపల్లి ప్యాలెస్ లో మార్పులు…

 సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో హోరాహోరీ ఫైట్ నెలకొంది. మొన్నటి వరకు 175 అన్న నినాదంతో ముందుకు సాగిన వైసిపి.. గెలిస్తే చాలు అన్నంత రేంజ్ లోకి పడిపోయింది. గెలుపు కోసం శ్రమిస్తోంది. ప్రచారానికి వారం రోజుల వ్యవధి ఉండగా..పోలింగ్ సైతం సమీపిస్తోంది.ఈ సమయంలో ప్రతిక్షణం కీలకమే. ఎక్కువమంది ప్రజల్లో ఉండేందుకే ఇష్టపడతారు. రెండోసారి అధికారంలోకి వస్తానన్న ధీమా జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏదో ఒక భయం ఆయన్ను వెంటాడుతోంది. ఈ తరుణంలో తాడేపల్లి ప్యాలెస్ లో మార్పులు చేర్పులు చేస్తుండడం విశేషం.గత ఎన్నికల్లో అమరావతి రాజధానిని నమ్మించేందుకు ఆయన తాడేపల్లిలో భారీ భవంతిని నిర్మించారు. గత ఐదు సంవత్సరాలుగా అదే భవంతి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వాస్తు దోషాలు పేరిట చేర్పులు మార్పులు చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల ఏం జరుగుతుంది? ఎవరెవరు ఉన్నారు? లాంటివి దగ్గరలో ఉన్న నివాసితులకు ఇట్టే కనిపించేవి. అయితే ఇప్పుడు భవనం చుట్టూ ఎత్తైన గోడలు నిర్మించారు. వాటికి ఐరన్ రాడ్లను ఏర్పాటు చేశారు. దీంతో లోపల ఎవరున్నా బయటకు తెలియని పరిస్థితి. కీలకమైన ఎన్నికలవేళ.. ఇంటి మూల ఉన్న ప్రహరీని తొలగించినట్లుగా చెబుతున్నారు. వాస్తు నిపుణుల సూచనలతోనే ఈ మార్పు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు.గతంలో ఉన్న ధీమా వైసీపీలో కనిపించడం లేదు.రోజురోజుకు ఆ పార్టీకి టైట్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కీలక నేతలు సైతం ఎదురీదుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెజారిటీ సర్వేలు సైతం ఎన్డీఏదే విజయం అని చెబుతున్నాయి. అటు పెద్ద ఎత్తున ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో లక్షన్నర వరకు వచ్చిన దరఖాస్తులు.. ఈసారి ఐదు లక్షలు వచ్చాయి.ఉద్యోగులు, ఉపాధ్యాయులు కసితో ఓటు వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు పేరిట నిర్మాణాలు చేస్తుండడం మాత్రంకాస్త అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటివరకు గెలుపు పై ధీమా ఉండగా.. ఇప్పుడు ఓటమి తప్పదు అన్న సంకేతంతోనే ఇటువంటి మార్పులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
===========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *